పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా తప్పు ఉంటే మూడేళ్ల పాటు జగన్ ఏం పీకాడు: బుద్ధా వెంకన్న

-

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పై టిడిపికి చెందిన నేతలు వరుసబెట్టి ఘాటు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ట్విట్టర్ వేదిక ద్వారా అంబటి రాంబాబు పై ఘాటు విమర్శలు చేశారు. అంబటి తో పాటు సీఎం జగన్ పైన బుద్ధ వెంకన్న సెటైర్లు సంధించారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఉంది రాంబాబు వ్యవహార శైలి అంటూ ఎద్దేవా చేశారు. ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా తప్పు ఉంటే జగన్ రెడ్డి మూడేళ్లపాటు ఏం పీకారు అని ప్రశ్నించారు బుద్ధ వెంకన్న. ఒక్క పిల్లకాలువ కూడా కట్టని మీ అధినేత, మీరు పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంది అని సెటైర్లు సంధించారు. కుర్చీ కోసం దిగజారే నైజం జగన్ రెడ్డిదన్న బుద్ధ వెంకన్న.. నాన్న పోగానే సీఎంని చేయమని సోనియా, రాహుల్ కాళ్ళపై జగన్ కుటుంబం పడిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఎవడో పెట్టుకున్న పార్టీని కబ్జా చేయడం నిజం కాదా? అంటూ ధ్వజమెత్తారు. కేసుల మాఫీ కోసం మోడీ కాళ్ళ పై పడిన ఘటన గుర్తు లేదా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version