పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!

-

పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి మధ్య గత కొద్ది రోజుల నుంచి విభేదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీతార హోటల్ లో పటాన్‌చెరు కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.  ఎన్నికల ఇంచార్జ్ మెట్టు సాయి కుమార్ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ధ్వజమెత్తారు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కాంగ్రెస్ నాయకులు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు కాకపోవడం గమనార్హం. 
పోలింగ్ కు రెండు రోజుల ముందు సమావేశం ఏమిటని ప్రశ్నించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.  ఆయన వర్గం ఎందుకు రాలేదని అడిగారు కాటా శ్రీనివాస్ గౌడ్. మరోవైపు ఎమ్మెల్యే తమ్ముడు ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో నిలిపి ప్రచారం చేస్తున్నాడని.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదని కాటా వర్గం కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు చేశారు. దీంతో పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ తగాదాలను చూసి తలపట్టుకున్నారు నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ మెట్టు సాయికుమార్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version