భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారన జరిగింది. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. అక్రమ నిర్మాణాలు చేపట్టే సమయంలో ఉన్న రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పేర్లు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే.. అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది.

అక్రమ నిర్మాణాలపై గతంలో కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఎక్స్ పర్ట్ కమిటీ వేసింది హైకోర్టు. అంతేకాదు.. గతంలో అక్రమ నిర్మాణాలను ఆ కమిటీ పరిశీలించింది. నివేదికను హైకోర్టుకు అందించింది. మరోవైపు ప్రస్తుతం భీమిలీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న ఫొటోలను హైకోర్టు ముందుంచారు పిటిషనర్ పీత మూర్తి యాదవ్. అక్రమ నిర్మాణాల ఫొటోల చూసి విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. వెంటనే అక్రమ కట్టడాలను తొలగింపును పరిశీలించాలని ఎక్స్ పర్ట్ కమిటీకి మరోసారి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version