ఇవాళ ఏపీలో స్కూళ్లకు హాలిడే.. అక్కడ మాత్రమే!

-

ఇవాళ విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ హాలిడే ప్రకటించారు అధికారులు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా డీఈఓ ప్రేమ్ కుమార్ అధికారిక ప్రకటన చేశారు.

In the wake of Prime Minister Narendra Modi’s visit, a holiday has been announced for all schools under the Greater Visakha Municipal Corporation

బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హాలిడే కు ప్రత్యామ్నాయంగా మరొక రోజు స్కూళ్లను ఒకరోజు నడిపించాలని అధికారులు పేర్కొన్నారు.

నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. విశాఖ టూర్ లో భాగం గా రోడ్ షో, బహిరంగలో పాల్గొనున్నారు ప్రధాని మోడీ.. ప్రధాని మోడీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఉండనున్నారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news