నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. విశాఖ టూర్ లో భాగం గా రోడ్ షో, బహిరంగలో పాల్గొనున్నారు ప్రధాని మోడీ.. ప్రధాని మోడీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉండనున్నారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ.
NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వేజోన్, క్రిస్ సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోడీ. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది.