ఆ జిల్లాల‌లో వ‌ర‌ద బాధితుల‌కు రూ. 1000 సాయం ఏపీ సీఎం జ‌గ‌న్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌త కొద్ది రోజుల నుంచి భారీ వ‌ర్ష‌లు ప‌డుతున్నాయి. అంతే కాకుండా మ‌రో రెండు మూడు రోజుల పాటు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ లో అతి భారీ వ‌ర్ష‌లు ప‌డుతాయ‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కురిసిన వ‌ర్ష‌ల కార‌ణంగా ఆంధ్ర ప్ర‌దేశ్ లో చాలా మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యం గా వ‌ర్ష ప్ర‌భావం చిత్తూర్, నెల్లూర్, క‌డ‌ప జిల్లాలో చాలా తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల‌లో ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా వ‌ర్షాల వ‌ల్ల చాలా కొల్పోయారు.

అయితే దీని పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ స్పందించాడు. ఈ మూడు జిల్లాల ప్ర‌జ‌లకు త‌క్ష‌ణ సాయం కింద రూ. 1000 అందిచాల‌ని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించాడు. అలాగే ఈ మూడు జిల్లాల ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాల వ‌స‌తులు ఉండేలా చ‌ర్య లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్లకు ఆదేశించాడు. అక్క‌డ ఉన్న రిజ‌ర్వాయ‌ర్లు, చెరువుల నీటి మ‌ట్టాల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు ప‌రిశీలించాల‌ని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version