కరోనా వైరస్ జర్మనీ దేశంలో విధ్వంసం సృష్టిస్తుంది. జర్మనీ లో గడిచిన 24 గంటలలో ఏకంగా రికార్డు స్థాయిలో 60 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా సంక్షోభం తర్వాత మళ్లి ఇంత భారీ సంఖ్యంలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి అయిందని.. తాము అందరం కరోనా వైరస్ నియంత్రణ కు టీకాలు తీసుకున్నామని జర్మనీ ప్రజలు కనీస జగ్రత్త పాటించలేదని తెలుస్తుంది. దీని వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుందని ఆ దేశ వైద్య ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు.
అయితే జర్మనీ లో కరోనా వైరస్ నియంత్రణ కు ప్రభుత్వం చర్యలు తీసుకున్న వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. జర్మనీ తో పాటు ఈ మధ్య కాలంలో రష్య లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అయితే ప్రజలు జగ్రత్త గా ఉంటే కరోనా వైరస్ ను అరికట్టవచ్చు అని వైద్య నిపుణలు తెలుపుతున్నారు. కరోనా నియంత్రణ టీకా వేసుకున్న కనీస జగ్రత్త లు పాటించాలని చెబుతున్నారు.