ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది ఇండిగో సంస్థ. ఏపీ ప్రభుత్వం బకాయి నిధులు ఇవ్వట్లేదని కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామని ఇండిగో సంస్థ పేర్కొంటుంది. ఏపీ ఎయిర్‌పొర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండిగో సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏటా 20 కోట్లు ఇండిగో సంస్థకు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు.
అయితే.. ఆ నిధులు ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 1 నుంచి విమాన సర్వీసులు నిలిపివేయాలని ఇండిగో ఇప్పటికే టికెట్ల విక్రయం ఆపేసింది. దీంతో ఆ బకాయి నిధులు ఇచ్చేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోందట. ఇండిగో సంస్థకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఇది ఇలా ఉండగా,సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్. ఇవాళ గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు చెందిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం జగన్. 2300 మెగా వాట్స్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.