చంద్రయాన్‌-3లో గద్వాల జిల్లా యువకుడు

-

చందమామ దక్షిణ ధ్రువంపై భారత కీర్తి పతాకను ఎగిరేసే చారిత్రక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని యావత్ భారత్ వీక్షించేందుకు ఇప్పటికే ఇస్రో ఏర్పాట్లు చేసింది. 41 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్‌-3.. బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్‌ – 3 మిషన్‌లో 2 పేలోడ్స్‌ (ఏహెచ్‌వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రాశారు.

చంద్రయాన్​-3లోని మిషన్‌లోని 2 పేలోడ్స్‌లో 5 మంది సభ్యులు పని చేసినా, వీటిలో ఎల్‌హెచ్‌వీసీ, ఐఎల్‌ఎస్‌ఏకు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్‌ అనాలసిస్‌ సాఫ్ట్‌వేర్‌ రాసినట్లు కృష్ణ తెలిపారు. ఎల్‌హెచ్‌వీసీ అంటే హారిజాంటల్‌ వెలాసిటీని చెబుతుందని, ఐఎల్‌ఎస్‌ఏ అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలు గుర్తించి రికార్డు చేస్తుందని వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ పేలోడ్స్‌ నుంచి వచ్చే డేటాని ఐఎస్‌టీఆర్‌ఏసీ, బెంగళూరు అందుకుంటుందని అన్నారు. చంద్రయాన్‌ -3 మిషన్‌కు 6 నెలల పాటు పని చేసినట్లు వివరించారు. చంద్రయాన్‌ -3 మిషన్‌ 100 శాతం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version