రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.. అనడానికి ఏపీలో మారిన ప్రభుత్వమే సాక్షి! అయితే, తాము నిలకడైన రాజకీ యాలు చేస్తామని, తమ సత్య సంధులమని, నిర్మాణాత్మక విమర్శలు తప్ప..తాము పోసుగోలు కబుర్లు చెప్పబోమని పదే పదే చెప్పుకొనే టీడీపీ నాయకులు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. 12 మంది చనిపోవడం, వేల సంఖ్యలో రోడ్లమీద పడడం వంటివి అందరినీ కలచి వేశాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిచాలో.. అంత వేగంగా స్పందించింది. కేవలం 10 నిముషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను ఆసుపత్రులకు చేర్చారు.
ఈ విషయాలను టీడీపీ అనుకూల మీడియాలోనే రాసుకుంది. అయితే, ఇప్పుడు టీడీపీ నాయకులు మాత్రం చిత్రమైన విమర్శ లు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని డీల్ చేయడంలో విఫలమయ్యారని, చంద్రబాబు కనుక ఇప్పుడు ఈ సమ యంలో అధికారంలో ఉంటే.. అంటూ.. కొత్త కొత్త చర్చలకు తెరదీసింది. వాస్తవానికి సీఎంగా జగన్ వెంటనే విశాఖ వెళ్లి బాధితుల ను పరామర్శించారు. తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అదేసమయంలో కోటి రూపాయల చొ్ప్పున పరిహారం కూడా ప్రకటిం చారు. అంతేకాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా డీజీపీని కూడా అక్కడే కొలువు చేసేలా ఆదేశించారు. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రభుత్వం మొత్తం విశాఖ నుంచే రెండు మూడు రోజులుగా పాలన సాగిస్తోంది.
ఇక, విశాఖ ఘటనపై జగన్ వెంటనే కేవలం ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీ వేశారు. అదేసమయంలో పరిశ్రమల నిపుణులతో మరో కమిటీ వేశారు. విద్యావేత్తలతో మూడో కమిటీ వేశారు. మొత్తంగా మూడు కమిటీల ద్వారా పరిస్థితిపై అధ్యయనం చే్యిస్తు న్నారు. ఇంకో పక్క, మంత్రులు, నాయకులు కూడా అక్కడే తిష్టవేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కేంద్రం కూడా పరిశీలించి.. సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరి ఈ విషయాలన్నీ తెలిసి కూడా టీడీపీ నాయకు లు .. మాత్రం యూటర్న్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తమకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, జగన్ వేసిన కమిటీలపై నమ్మకం లేదని కొత్తవ్యాఖ్యలు చేస్తన్నారు.
అంతేకాదు, తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్.. రూ.కోటి మీకిస్తాం.. మీరుచచ్చిపోతారా? అంటూ.. విశాఖ ప్రజలు అడుగినట్టు ట్వీట్ చేశారు. ఇక, చంద్రబాబు అటు కేంద్రానికి లేఖలు రాశారు. అయితే, అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రజలకు మొరపెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వాస్తవానికి ఇంతకన్నా ఎవరు మాత్రం చేయగలరో చెప్పాలి. పరిశ్రమపై చర్యలుతీసుకోవాలని అంటున్నారు. నిజమే ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టారు. అంతేకాదు, దీనికి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ విభాగం.. అవి కూడా సీరియస్‌గానే ఉన్నాయి. ఇవన్నీ తెలిసికూడా జగన్ ఏమీ చేయడం లేదని చెప్పడం అంటే.. లేని రాజకీయాలు చేయడమే అవుతుంది. దీనివల్ల టీడీపీ టీం నిబద్ధత పెరగకపోగా.. ఉన్నది కూడా పోతుందనే భావన వ్యక్తమవుతోంది.