విశాఖ నుంచి ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయి !

-

 

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ప్రస్తుతం మిలీనియం టవర్స్ ను ముఖ్యమంత్రి గారి సమీక్ష కార్యాలయం ఏర్పాటు కోసం ఖాళీ చేయాలని ఆదేశించడంతో, ఎన్నో ఐటీ కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వదిలి తరలి వెళ్తున్నాయని, దేశవ్యాప్తంగా శాఖలు కలిగిన ఒక ఐటీ కంపెనీకి విశాఖలో కూడా బ్రాంచ్ ఉందని, దాదాపు 700 నుంచి 800 మంది పనిచేస్తున్నారని, ఇప్పుడు ఆ ఐటీ కంపెనీ మిలీనియం టవర్స్ లో నుంచి కార్యాలయం ఎత్తివేయాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుందని తెలిపారు.

విశాఖ నుంచి గంపగుత్తగా ఐటీ కంపెనీలు తరలిపోయే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారని, విశాఖ వాసుల కష్టాలు గాజాలో గజగజ వణుకుతున్న ప్రజలను తలపిస్తున్నాయని అన్నారు. భారతీ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా భయంతో విశాఖవాసులు హడలిపోతున్నారని, అదే రోజు జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో కాలు పెడుతుండడమే దానికి కారణం అంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు నివసించనున్న ప్యాలెస్ కు సమీపంలో సముద్ర తీరంలో కూడా ఒకటి రెండు కిలోమీటర్లు ఎటువంటి బోట్లు తిరగకూడదని నిషేధాజ్ఞలు విధించారని, కే జి ఎఫ్ 2 సినిమాలో మాదిరిగా ఇంట్లో నుంచే షిప్ లో వెళ్లిపోతాడేమోనని ప్రజలు అనుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news