హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం

-

టీడీపీ అధినే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. కారులో సంఘీభావ యాత్ర పేరుతో అధిక సంఖ్యలో కార్లలో బయలుదేరారు. పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లోని గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, ఎల్బీనగర్  తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించి సంఘీభావం తెలపనున్నారు ఐటీ ఉద్యోగులు.

మరోవైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. అక్కడక్కడ తనిఖీలను కూడా చేపడుతున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతా రాణాటాటా ఓ ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా ఏపీ-తెలంగాణ బార్డర్ లో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఐటీ ప్రొఫెషనల్ కార్ల ర్యాలీలు పలు మార్గాలలో వస్తుండటంతో వందలాది సంఖ్యలో పోలీసులను మొహరించారు. విజయవాడ వైపు వెళ్లే కార్లను ఆపీ తనిఖీ చేసి పంపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version