లండన్‌ నుంచి ఏపీకి చేరుకున్న జగన్‌ ఫ్యామిలీ

-

సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చేరుకుంది సీఎం జగన్‌ కుటుంబం. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది.

Jagan family reached AP from London

ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్‌ కుటుంబానికి స్వాగతం పలికారు.

అనంతరం ఇవాళ వైసీపీ పార్టీ నేతల తో భేటీ అయి ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. కాగా కోర్టు అనుమతితో ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లారు. కుటుంబ సమేతంగా లండన్‌తో పాటు యూకే, స్విట్జర్ లాండ్‌లోనూ ఆయన పర్యటించారు. జూన్ 31తో జగన్ పర్యటన గడువు ముగియడంతో తిరిగి రాష్ట్రానికి బయలుదేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version