వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ. వివాహాలకు చేసుకున్న పేదలకు అండగా నిలుస్తున్నామని.. ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా, ఇలా చేయడంలో పదోతరగతి కచ్చితంగా చదివి ఉండాలని నిబంధన తీసుకు వచ్చామన్నారు.
అప్పుడే కళ్యాణమస్తు, షాదీతోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని… దీని వల్ల పదో తరగతి వరకూ చదివించాలన్న తప్పన ప్రతి పేద కుటుంబంలో మొదలవుతుందని వివరించారు. ఆడపిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టామని…. పదోతరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందన్నారు. ఆతర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుంది..అందువల్ల నేరుగా ఇంటర్మీయడిట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. జగనన్న వసతి దీవెనకూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నామని.. ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాయని వెల్లడించారు.