తిరుమల శ్రీవారి కోపం చంద్రబాబుకు తాకేలా ప్రజలు పూజలు చేయండి అంటూ పిలుపునిచ్చారు జగన్. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకుంటూ కుతంత్రాలు చేయటం న్యాయమేనా అని ప్రశ్నించారు. నన్ను గుడికి పంపినా పంపకపోయినా రాష్ట్రం మీద అభిమానం ఉన్న వారంతా మీమీ ప్రాంతాల్లో ఆలయాలకు.
వెళ్లి చంద్రబాబు తప్పు చేశారు మేం కాదు అని దేవుడికి చెప్పండని కోరారు జగన్. దేవుడి కోపం ఉంటే అది చంద్రబాబు పై చూపించాలని రాష్ట్రం పై వద్దని దేవుడికి కోరండని వెల్లడించారు. నా మతం మానవత్వం.. రాసుకుంటే డిక్లరేషన్ బుక్ లో రాసుకోండి. నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను. హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తాను. ముస్లిం, జైన, సిక్కు మతాన్ని అనుసరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే గుడిలోకి అనుమతిస్తలేరు. ఇక దళితుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అన్నారు.