ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఎంబిబిఎస్ సీట్లపై కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రైవేట్, మైనార్టీ, నాన్ మైనార్టీ వైద్య, డెంటల్ కాలేజీల్లో కాంపిటేట్ అథారిటీ కోట MBBS, BDS సీట్లలో 100% ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర విద్యార్కులకే దక్కనున్నాయి.
ఈ మేరకు నిబంధనల్లో జగన్ ప్రభుత్వం సవరణలు చేసింది. 2014 జూన్ 2 తర్వాత ఏర్పడ్డ మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా మంజూరైన MBBS, BDS సీట్లను AP విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఇకపై అన్ రిజర్వుడ్ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉండదు.
ఇక అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే వార్త చెప్పారు. జగనన్న తోడు పథకం లో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం రేపు నిర్వహించనుంది. 5.1 లక్షల మంది ఖాతాలలో పదివేల రూపాయల చొప్పున ఏకంగా 510 కోట్లను జమ చేయనుంది జగన్ సర్కార్.