నేటి నుంచే జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర.. ఇడుపులపాయ నుంచే సమరం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మే 13వ తేదీన ఏపీలో ఈ రెండు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభిస్తారు.

Jagan to Go on Memantha Siddham Bus Yatra Across 21 Districts in AP

మొదట ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఏలూరు, అనంతపురం, వైజాగ్, బాపట్ల నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ జిల్లాలలో ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించారు. అందుకే మిగతా జిల్లాలను కవర్ చేయనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version