టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పై సెటైర్లు వేశారు. చంద్రబాబుది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తీసుకువచ్చింది మేనిఫెస్టో అయితే.. చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని అన్నారు. గతంలోని హామీలను నెరవేర్చలేని చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
తన పాలనలో చంద్రబాబు ఎంతమంది ప్రజలను ధనవంతులను చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ పాలన చంద్రబాబు, ఎల్లో మీడియా కి నరకం.. సామాన్యులకు స్వర్గంలా ఉందని వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేస్తే ఓటెయ్యండి.. లేకపోతే వద్దని దమ్ముగా చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అంబటి రాంబాబు.