2027లో జమిలి ఎన్నికలు..పొత్తులపై వైసీపీ కీలక నిర్ణయం !

-

2027 లో జమిలి ఎన్నికల్లో పొత్తులపై జగన్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. నాయకుల్ని పొగుట్టుకొం.. అందరినీ నిలబెట్టుకుంటామని తెలిపారు. జగన్…. ఫిబ్రవరి నుంచి ప్రజల్ని, నాయకుల్ని కలుసుకునేందుకు ప్రజల్లోకి వస్తున్నారని ప్రకటన చేశారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయి…వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు విజయసాయిరెడ్డి.

Jamili elections in 2027 YCP’s key decision on alliances

వైసిపి కార్యకర్తలను కూటమి నేతలు గ్రామాల నుంచి తరిమేస్తున్నారు… గ్రామాల చివర్లో టెంట్ లు వేసుకుని వుండే భయానక వాతావరణం సృష్టించారని ఆగ్రహించారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని… కాకినాడ సీ పోర్టులో కేవి రావు ఎవరో తెలియకపోయినా నా పై కేసు పెట్టారని ఫైర్‌ అయ్యారు.

మేము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే 3 ,4 నెలలు జైల్లోకి వెళ్ళినా పోరాటం చేస్తామని… నా మీద లుక్ అవుట్ నోటీస్ ఎందుకు అంటూ నిలదీశారు. మీరు పిలిస్తే నేను సీఐడి ఆఫీస్ కు వస్తా.. అరెస్టు చేసుకోండి అంటూ తేల్చి చెప్పారు. బెయిల్ పిటిషన్ కూడా వేయను… భయపడేది లేదు. భయం వైసిపి నాయకులు రక్తంలో లేదని తెలిపారు. నేను విశాఖలో ఒక్క సెంట్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయలేదని…. బంధువులు కోనుగోలు చేస్తే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version