BREAKING: జేసీ దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధం !

-

జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. అనంతపురం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ రోజు అంటే గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై 11 KV వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి.

JC Diwakar Reddy’s private travel buses were burnt

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అటు దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగింది. ప్రస్తుతం మంటలను అదుపు చేస్తోంది ఫైర్ సిబ్బంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version