పవన్ కళ్యాణ్..తన జీవితంలో సీఎం కాలేడని కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్. మంచి ఉద్దేశ్యంతో జీవో వన్ తీసుకుని వచ్చాం.. ప్రజల హక్కులకు భంగం కలుగకూడదనే జీవో వన్ అని తెలిపారు. రోడ్ల పై బహిరంగ సభలు పెట్టి ప్రజల ప్రాణాలు పోవటానికి చంద్రబాబు కారణం అయ్యాడు… ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వంగా మా బాధ్యత అని వివరించారు.
దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళతామని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. రోడ్ల పై సభలు పెట్టి తొక్కిసలాట చేయించటం ప్రజాస్వామిక విజయం అవుతుందా?? కోర్టు తీర్పులో ఏముందో పూర్తిగా పూర్తిగా చూడలేదన్నారు. ప్రజా మద్దతు ఉంటే పొత్తుల కోసం వెంపర్లాట ఎందుకు?! అని ఆగ్రహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా మద్దతు ఎవరికి ఉందో ప్రజలే నిర్ణయిస్తారు… పూజకు పనికి రాని పువ్వులా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు.. పవన్ కళ్యాణ్ ను జీవితంలో సీఎం అవలేడని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ ఉంటే చాలు అని విమర్శలు చేశారు మంత్రి జోగి రమేష్.