నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగులబోతుంది. వైసీపీ రెబల్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కలిగిరిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించుతున్నారు వైసీపీ రెబల్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. దీంతో ఉదయగిరిలో రాజకీయాలు మారిపోయాయి.త్వరలోనే ఎమ్మెల్యే మేకపాటి టిడిపి.లో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.