మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నేల్లి బెయిల్ పిటీషన్ల పై 18న తీర్పు

-

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై ఈనెల 18న తీర్చు వెలువడనుంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి అరెస్టయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది.

దీంతో ఆయన గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా.. పిన్నెల్లి తరపున న్యాయవాదులు బెయిల్ కోసం వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి నేర చరిత్ర.. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. పిన్నెల్లి కొద్ది రోజులు పరారుకావటంపైనా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని, పోలీసు విచారణకు ఏ మాత్రం సహకరించటం లేదన్న విషయాన్ని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీస్ కస్టడీ విచారణ వివరాల్ని కోర్టు ముందుంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version