శ్రీ సత్యసాయి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ జెండాల కలకలం

-

శ్రీ సత్యసాయి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ జెండాల కలకలం రేపాయి. టీడీపీ పార్టీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ కు విడదీయలేని బంధం ఉందన్న సంగతి తెలిసిందే. టీడీపీ పార్టీలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలని… ఏపీ సీఎం కావాలని మొదటి నుంచి డిమాండ్స్‌ ఉన్నాయి. కానీ టీడీపీ పార్టీ పట్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ కు గౌరవం ఉంది కానీ.. ఆయన రాజకీయాల్లోకి రావడం లేదు.

Junior NTR jingle of flags

అయితే తాజాగా పెనుకొండలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబితమ్మ నామినేషన్ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ జెండాల కలకలం రేపాయి. టిడిపి , బిజెపి , జనసేన జెండాలతో పాటు జూనియర్ ఉన్న జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు నందమూరి అభిమానులు. ఫ్యూచర్ సీఎం అంటూ జెండాలను ప్రదర్శించారు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version