ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి నే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దాడులు.. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి లా కాకుండా ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అని కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రజల ఆకాంక్షల గురించి ఆలోచించలేదు.
అలాగే రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లని చెప్పారు. అయినా ఎలక్షన్స్ లో సంపాదనను సృష్టించి పథకాలను అమలు చేస్తానని చెప్పారు. ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయని .. ఏమీ చేయలేకపోతున్నామని మొసలి కన్నీరు కారుస్తున్నారు. అలాగే ఇసుక ఉచితమని చెబుతున్నారు కానీ.. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైంది. ప్రతినెలా పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోంది. ఇక తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకున్నా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ శకటాన్ని మాత్రం ప్రదర్శించారు అని కాకాణి పేర్కొన్నారు.