ఏపీని అగ్ని గుండంలా మార్చాలని టిడిపి సర్కార్‌ చూస్తోంది – కాకాణి ఫైర్‌

-

ఏపీని అగ్ని గుండంలా మార్చాలని టిడిపి సర్కార్‌ చూస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం మొదలైందని… వై.సి.పి నేతలపై దాడులు చేయడంతో పాటూ మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే. వైసిపి నేతల పైనే కేసులు నమోదు చేస్తున్నారు..చంద్రబాబుకు అధికారమిస్తే టిడిపి నేతలు ఏమి చేస్తారనే విషయం తేట తెల్లమవుతోందని వెల్లడించారు.

Minister Kakani at a rave party in Bangalore

తోటపల్లి గూడూరు మండలంలో ఆక్వా రైతుల ఆస్తులను తగలబెట్టారు.. ఆక్వా గుంటల్లో విషాన్ని కలిపారు… ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధ్వంశాలకు పాల్పడటం సరికాదని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారు… చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెర తీశారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఆస్తులపై దాడులు చేసినా భయపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు… పోలీస్..అధికార యంత్రాంగం ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని పగలగొట్టడం సరికాదు… ఎమ్మెల్యేలు నిన్న నే ప్రమాణం చేశారన్నారు. ఆ రోజు నుంచీనే విధ్వంసపాలనను ప్రారంభించారు… వై.సి.పి.నేతల ఆస్తులను పగలగొడతామని సంకేతం ఇచ్చారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version