భువనేశ్వరి, బ్రాహ్మణి మద్య గొడవలకు వాలంటీర్లు కారణమా..? – వైసీపీ ఎమ్మెల్సీ

-

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌అయ్యారు. చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి అని… కాల్ మనీ సెక్స్ రాకెట్స్ నిందుతులకు పెద్దపీట వేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్‌… చంద్రబాబు మాటలను చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. చంద్రబాబు కుటుంబంలో వాలంటీర్లు ఏమైనా గొడవలు పెట్టారా..? అని నిలదీశారు.

చంద్రబాబు, లోకేష్ వేర్వేరుగా కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? భువనేశ్వరి, బ్రాహ్మణి మద్య గొడవలకు వాలంటీర్లు ఏమైనా కారణమా..? అంటూ రెచ్చిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. నారా లోకేష్ తో గొడవ పడి చంద్రబాబు పామ్ హౌస్ లో కాపురం ఉండడానికి వాలంటరీలు కారణమా..? అని మండిపడ్డారు. మహిళలు పట్ల గౌరవం లేని సంస్కారహీనుడు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ తల్లిని చంద్రబాబు లోకేష్ దారుణంగా అవమానించారన్నారు. సిగ్గు లేకుండా అదే టిడిపితో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని ఆగ్రహించారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

Read more RELATED
Recommended to you

Latest news