ఎన్టీఆర్ ను చంపడంలో రామోజీ రావు పాత్ర – కమలాపురం ఎమ్మెల్యే

-

ఎన్టీఆర్ ను చంపడంలో రామోజీ రావు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. తనపై రాసిన వార్తపై రామోజీరావు కడప కోర్టుకు తిరగక తప్పదని…కడపలో ఎంతో మంది వెంచర్లు వేస్తారని వార్నింగ్ ఇచ్చారు. దాన్ని నాకు ఆపాదించడం సరికాదు….అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి అంటూ నిలదీశారు.

Kamalapuram MLA Rabindranath Reddy fire on Ramoji Rao

కమిషన్లు తీసుకున్నారని ఆరోపించిన వారు దమ్ముంటే నిరూపించాలి..రోజు ఒక ఎమ్మెల్యేపై బురద జల్లాడమేనా..? అని నిలదీశారు. ఎన్టీఆర్ ను చంపడంలో రామోజీ రావు పాత్ర వుంది..తప్పుడు వార్తలు రాసి ఎన్టీఆర్ చనిపోయేలా చేశావని ఆగ్రహించారు. జగన్ చరిత్ర సృష్టించారు..రామోజీ రావు పై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాతలు రాసే ముందు వివరణ తీసుకోవాలి..ముచ్చటగా మూడోమారు గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ప్రకటించారు. ప్రజాసేవ చేసే వారినే ప్రజలు ఎన్నుకుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version