బాలకృష్ణ ఓ సర్టిఫైడ్ సైకో – వైసీపీ ఎమ్మెల్యే

బాలకృష్ణ ఓ సర్టిఫైడ్ సైకో అని వైసీపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి కన్నబాబు ఫైర్‌ అయ్యారు. సీఎం స్థాయి ఎంత అని ఓ వ్యక్తి అడుగుతున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. ఒంటి చేత్తో 151 సీట్లు సాధించిన జగన్ స్థాయి ఏంటో అందరికీ తెలుసన్నారు.

మంగళగిరి, భీమవరం, గాజువాకలో ఓడిపోయిన వారు జగన్ స్థాయి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాలకృష్ణను సర్టిఫైడ్ సైకో అన్న కన్నబాబు మీసం మెలేయడం వృత్తి ధర్మమని చెప్పడమేంటని ఎద్దేవా చేశారు.కరెంటు పోయినప్పుడు సంతకాలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు కన్నబాబు. కేబినెట్ ఆమోదం చేసింది ఒకటి.. ఒప్పందం మరొకటన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ స్కామ్ ని వెలికితీశాయని చెప్పుకొచ్చారు.

యువతకు శిక్షణ పేరుతో చంద్రబాబు అందిన కాడికి దోచుకున్నాడని మండిపడ్డారు. పక్క ప్లాన్ ప్రకారమే బాబు ఆదేశాలతో ఇదంతా జరిగిందన్నారు. ఎంఓయు అంతా ఫేక్ అన్న కన్నబాబు.. దానికి సంబంధించిన పేపర్లపై తేదీలు కూడా లేవన్నారు. స్కాం లో డిజైన్ టెక్ అనే కంపెనీకి ముందుగా మనీ ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ఆ తరువాత షెల్ కంపెనీలకు ఆ నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని పేర్కొన్నారు.