తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఇల్లు నిర్మించుకునేందుకు 75 గజాల స్థలం అందించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు సొంతిల్లు నిర్మించుకునేందుకు 75 గజాల చొప్పున ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేస్తోంది.
ఇప్పటివరకు 30,000 మందికి పట్టాలు పంపిణీ చేయగా… మరో 20,000 మందికి వారం, పది రోజుల్లో అందజేయాలని భావిస్తోంది. తహసీల్దార్లు అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. కాగా, గతంలోనే భూములను సిద్ధం చేయగా… మధ్యలో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి వాటిని పంపిణీ చేస్తోంది.
ఇక అటు సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. దసరా పండుగ వస్తున్న తరుణంలోనే… సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త అందించింది. 11 వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగానే… మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ. 1,450 కోట్లు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇక నిన్న సాయంత్రం నుంచి కార్మికుల బ్యాంక్ ఖాతాలో ఏరియర్స్ జమ చేసినట్లు వెల్లడించింది తెలంగాణ సర్కార్.