సీబీఐపై రఘురామ వివాదస్పద వ్యాఖ్యలు..వలపు యుద్ధం చేయకండి…!

-

సీబీఐపై రఘురామ వివాదస్పద వ్యాఖ్యలు..చేశారు. వలపు యుద్ధం చేయకండి… అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేస్తే చేయండి లేకపోతే లేదంటూ పోస్ట్‌ పెట్టారు రఘురామ. అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి ప్రతిబంధకాలు లేవని, అరెస్టు చేస్తారా? చేయరా?? అన్నది వాళ్ళ ఇష్టం అని, అరెస్టు కావాలంటే చేసుకోవచ్చునని, లేదంటే డ్రామాలు ఆడుకోవచ్చునని, అంతేకానీ వలపు యుద్ధాలను మాత్రం చేయవద్దు అని అన్నారు.

సీబీఐ చేస్తున్న వలపు యుద్ధం వల్ల మా పార్టీ అప్రతిష్ట పాలవుతోందని, ఇంకా ఈ పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా, ఈ ప్రభుత్వం ద్వారా పార్టీ పరువు ప్రతిష్ట సంక నాకి పోవడం తనలాంటి ఎంతో మంది పార్టీ సభ్యులకు ఇష్టం లేదని అన్నారు. ఇది గుండాల పార్టీ అని మా పార్టీకి ఓటు వేసే సాలిడ్ ఓటర్లు దూరమైతే, ఇక సాధారణ ప్రజలు మా పార్టీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.

తమ పార్టీ పరువును సీబీఐ బజారుకీడుస్తోందని, అందుకే సీబీఐ అంటే తనకు కోపమని, సీబీఐ వ్యవహార శైలి వల్ల తమ పార్టీ దెబ్బతింటుందని, తమ పార్టీ పరువు తీయవద్దన్నది తన విన్నపం అని అన్నారు. పార్టీలో కొనసాగుతున్న సభ్యులను గుండాలుగా చిత్రీకరించవద్దని కోరుతున్నానని, అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనుకుంటే సాయంత్రంలోగా అరెస్టు చేయండని, సుప్రీం కోర్టులో ఈరోజు డాక్టర్ సునీత గారు విజయం సాధించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version