పాదయాత్రలో లోకేష్ మరణకాండ సృష్టిస్తున్నారు – మంత్రి కారుమూరి

-

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో లోకేష్ మరణకాండ సృష్టిస్తున్నారని..గొడవలు లేకుండా ఉన్న పచ్చని ప్రశాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రెడ్ షర్ట్ ధరించి రౌడీ లులాగా యువగళం పాదయాత్రలో కార్యకర్తలు దాడులు చేస్తున్నారని…లోకేష్ దగ్గర ఉండి ఫ్లెక్స్ చించి వేయడం తో పోలీసులు అడ్డుకుంటే వారిపై దాడులకు దిగారని ఆగ్రహించారు.

యువగళం పాదయాత్రలో దాడులకు , దాడులకు దిగిన వారి అందరిపై కేసులు నమోదు చేయాలని..కేసులు ఉన్నవారిఅందరిని పక్కన పెట్టుకుని దాడులు చేయిస్తున్నాడు పప్పు లోకేష్ అంటూ మండిపడ్డారు.వారిపై ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తామంటూ లోకేష్ వారిని రెచ్చకొడుతున్నాడని.. యువగళం వాహనంలో కర్రలు తో తిరుగుతున్నారు, అన్ని ఆధారాలుతో వారు పట్టుబడ్డారన్నారు. 5గురు పోలీసులుకు తీవ్ర గాయాలు అయ్యాయి, వారిలో ఒకరి పరిస్థితి విషమoగా ఉందని..తణుకు మునిసిపల్ కార్యాలయంలో మంత్రి కారుమూరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version