BREAKING : కాంగ్రెస్ మాజీ నేత, కరుడు గట్టిన సమైఖ్య వాది లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ కోసం అనుచరుల సన్నాహక సమావేశం ఇవాళ విజయవాడలో జరిగిందని సమాచారం అందుతోంది. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతోంది ఆయన వర్గం.
ఈ నెలాఖరులో అనుచరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న రాజగోపాల్..విజయవాడ సిటీలో ఓ హోటల్ లో నిన్న రహాస్య భేటీ జరిపారట. వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా బరిలోకి దిగాలని కోరుతున్నారు ఆయన అనుచరులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పొలిటికల్ కెరీర్ కు స్వస్తి పలికిన రాజగోపాల్…ఇప్పుడు రీ – ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది.