మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాల్లో గెలిచిన.. గాలి నా కొడుకులు ఎక్కువయ్యారంటూ కూటమి నేతలపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలని హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారని చురకలు అంటించారు.

రేపు అమెరికా పోతారన్నారు. పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిందని సెటైర్లు పేల్చారు. ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానంటాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అయితే మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన కామెంట్స్ కు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రోజా ఆడనా..మగనా ఎవరికీ తెలియదు.. జగన్ కూడా దాని కొడుకేనా? అంటూ మాజీ మంత్రి RK రోజాపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.