ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. సోమవారం కసిరెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇక అటు నేడు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి.

లిక్కర్ కేసులో అక్రమాలపై మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. ఈ రోజు విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసులో నిన్న సాయి రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. ఇక ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి.