కేదార్‌నాథ్, బద్రీనాథ్ మరో నెలలో తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. కేదార్‌నాథ్ ఆలయం మే 2న భక్తుల కోసం తెరుచుకోనుందని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. అదే విధంగా బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న ఓపెన్ చేయనున్నట్టు తెలిపారు.

రెండో కేదార్‌గా పిలువబడే మదామహేశ్వర్ ఆలయం మే 21న, 3వ కేదార్ తుంగనాథ్ గుడి మే 2న తెరవనున్నారు. ఈ ఆలయాలు వేసవిలో కొన్ని నెలల పాటు మాత్రమే తెరచి ఉంటాయి.