ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియామకం

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత డిజిపి గౌతమ్ సవాంగ్ పై వేటు వేశారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి ని నియమించింది సర్కార్. డీజీపీగా వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్న రాజేంద్రనాథ్‌ రెడ్డి.. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందారు.

గతంలో విజయవాడ సీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా పనిచేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేసారు.

కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. సర్వీస్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రెసిడెంట్‌ మెడల్‌ సాధించారు కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఇక అటు ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే డీజీపీ గౌతం సవాంగ్‌ ఎందుకు వేటు వేశారు అనేదానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version