ముస్లిం సోదరులకు కేసీఆర్, జగన్ రంజాన్ శుభాకాంక్షలు

-

నేడు రంజాన్‌ పండుగ. ఈ నేపథ్యంలోనే..ఏపీ ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌‘ శుభకాంక్షలు చెప్పారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యం, సుహృద్భావం, సర్వమానవ సమత్వం, కరుణ, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు.

అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని స్పష్టం చేశారు.

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అటు తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కూడా రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. ముస్లిం సోదరులు సుఖ శాంతులతో ఉండాలని కోరారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version