జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కేసీఆర్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. మే 9వ తేదీ అంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు విధుల్లో చేరాలని జెపిఎస్ కు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది.
ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే… చేరని వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని తెలిపారు.