మంగళవారం ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేస్తే పనులు వెంటనే పూర్తవుతాయి..!

-

మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే పనులు పూర్తవుతాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.హనుమంతుడి అనుగ్రహం వల్ల జీవితానికి సంబంధించిన సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. అష్టసిద్ధి ప్రదాత అయిన శ్రీ హనుమంతుని ఆరాధనకు మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జీవితంలో ఐశ్వర్యాన్ని పొందాలంటే.. హనుమంతుని పూజకు కొన్ని నియమాలు తెలిపారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హనుమంతుని ఆరాధనలో సిందూరం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆయనకు సింధూరం అంటే చాలా ఇష్టం. కనుక మంగళవారం పూజ సమయంలో సింధూరం సమర్పించండి. అలాంటి భక్తుడికి కావాల్సిన వరాన్ని భజరంగబలి ఇస్తాడని విశ్వాసం. అంతేకాదు నూనె, వెండి లేదా బంగారు కూడా ఆంజనేయుడికి సమర్పించండి. ఇలాంటి పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలోని అరిష్టాలు తొలగిపోయి.. సంతోషం వెల్లు విరుస్తుంది..

అదే విధంగా..తమలపాకులతో పూజలు చెయ్యడం కూడా ముఖ్యమే.. అన్ని దేవతల పూజలో తమలపాకును ను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎవరైనా మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకును సమర్పిస్తే చేపట్టిన పని తప్పని సరిగా పూర్తి అవుతుంది. హనుమంతుడి దయతో ఆ పని త్వరగా పూర్తవుతుందని నమ్ముతారు. హనుమంతుడి శుభ ఫలితాలను ఇవ్వాలంటే మంగళవారం తమలపాకుతో పూజ చెయ్యడం వల్ల ప్రతి మంగళవారం చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయి..

ఇకపోతే చివరగా జెండాను పవిత్ర చిహ్నంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో మంగళవారం మీ విశ్వాసం, సామర్థ్యం ప్రకారం బజరంగికి జెండాను సమర్పించండి. మంగళవారం హనుమంతునికి శ్రీ రాముడు అని ఉన్న జెండాను సమర్పించడం కూడా మంచిదే.. ఇలా చెయ్యండి.. మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version