డిగ్రీ విద్యార్థులకు అలెర్ట్. డిగ్రీ అడ్మిషన్లను ఇప్పటి నుంచి ఆఫ్లైన్ లోనే తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థికి కాలేజీలో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసే విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిగ్రీ కాలేజీలు, యాజమాన్యాలతో జరిపిన సమావేశంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ నెల నుంచి కొత్త ఫీజుల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు ప్రతినెల పెండింగ్ ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా… మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాటాను జమ చేసిందని సమాచారం అందుతుంది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.