అమరావతి పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతిలో పనులు జరగడం లేదని చాలా రకాల ప్రచారాలు వస్తున్నాయని వాటిని ఎవరరూ కూడా నమ్మవద్దంటూ మంత్రి నారాయణ ప్రజలను కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ఇంటి లోపల పనులు జరుగుతున్నాయి.
వర్షం లేని సమయంలో బయట పనులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో వచ్చే మూడు సంవత్సరాలలో క్యాపిటల్ సిటీని పూర్తి చేస్తామంటూ మంత్రి నారాయణ కోరారు. మరోవైపు సింగపూర్ తో సంబంధాలు దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరించేందుకు సీఎం ఆ దేశానికి వెళుతున్నారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.