జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. గ్రూప్-1 పరీక్షల్లో కీలక మార్పులు చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ప్రశ్నావళిని మార్చాలని, కొన్ని పేపర్లు తగ్గించాలని కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్న పత్రాలు ఉన్నాయి. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ కు వెయిటేజ్ తగ్గించాలని భావిస్తుంది.
జనరల్ ఆప్టిట్యూడ్ కు జనరల్ స్టడీస్ తో సమానంగా ప్రశ్నలు ఉండడం వల్ల గణితం చదివిన వారికి ఎక్కువ మార్కులు సాధించే అవకాశం లభిస్తోందని, అందువల్ల జనరల్ ఆప్టిట్యూడ్ కు వెయిటేజ్ తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిమ్స్ లో ఒక పేపర్ తొలగించి ఎక్కువ జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఉండేలా కొత్త తరహా ప్రశ్నావళిని రూపొందించాలని భావిస్తోంది. మెయిన్స్ లో అర్హత పరీక్షలు కాకుండా ఐదు పేపర్లు ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ పూర్తిగా వ్యాసరూప విధానంలో ఉన్నాయి.