ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యాడు. ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. సజ్జల శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌రెడ్డిని హజరుపర్చనున్నారు సిట్ అధికారులు.

అటు ఏపీ లిక్కర్ స్కామ్ పై తొలిసారి విజయసాయి రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని పేర్కొన్నారు . ఏ రూపాయి నేను ముట్టలేదని వెల్లడించారు విజయసాయి రెడ్డి. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానన్నారు విజయసాయి రెడ్డి.
- ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్
- సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
- లిక్కర్ స్కామ్ లో A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి
- రాత్రి హైదరాబాద్ లో శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇవాళ శ్రీధర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు