ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనపై హోం మంత్రి అనిత కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆమె ఆదేశాల మేరకు గాలివీడు ఎంపిడివో జవహర్ బాబు పై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు అయింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారు అన్న అంశం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశౄరు. దాడి ఘటనలో మొత్తం 26 మందిపై కేసు నమోదు అయింది.
దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న జవహర్ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ వైద్యులకు ఆదేశించారు పవన్, హోం మంత్రి అనిత. ఇక నేడు జవహర్ బాబు ను పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘మన్యం’ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. విచారణకు ఆదేశించారు హోంమంత్రి వంగలపూడి అనిత.