కడపలో విషాదం…అప్పుల బాధలతో రైతు కుటుంబం ఆత్మహత్య

-

కడప జిల్లాలో విషాదం నెలకొంది. అప్పుల బాధలతో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే… అప్పుల బాధలతో రైతు కుటుంబం ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Farmer’s family committed sicide due to debts

ఇక ఈ సంఘటనపై విషయం తెలియగానే… రంగంలోకి పోలీసులు దిగారు. మృతులు నాగేంద్ర, వాణి, పిల్లలు గాయత్రి, భార్గవ్ గా గుర్తించారు పోలీసులు. 15 ఎకరాలు కౌలుకు తీసుకొని 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతు…కాస్త నష్టపోయారట. దీంతో… అప్పుల బాధలతో రైతు కుటుంబం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు. రైతు కుటుంబం ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news