ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ పార్టీనే కాదు..నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో.. టీడీపీ పార్టీ అసలు డిపాజిట్ కూడా దక్కదని.. టీడీపీ నాయకులు కోరుకుంటున్నట్లే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారని కొడాలి స్పష్టం చేశారు.
జగన్ మోహన్ రెడ్డిలో ప్రవహించే రక్తం వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి రక్తం అని.. మీలాగా వెన్నుపోటు పొడిచే రక్తం కాదని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు భయపడుతున్న రోజుల్లో… 16 నెలలు జైల్లో ఉండీ కూడా జగన్ వెనక అడుగు వేయలేదని.. 151 ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మీది కుక్క బతుకు అంటూ .. చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.