మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ ను అవమానించిన కొల్లు రవీంద్ర !

-

కృష్ణా జిల్లాలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. వైసీపీ హయంలో రవీంద్ర బాబు నాపై తప్పుడు కేసు బనాయించారని ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్రమంగా అరెస్టు చేసిన రవీంద్రనాథ్ బాబు నన్ను నా కుటుంబాన్ని వేధించారని మండిపడ్డారు.

Kollu Ravindra insulted former SP Rabindranath

నన్ను, నా కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు తొత్తులా పని చేసిన వ్యక్తిని ప్రభుత్వ అధికార సభకు ఆహ్వానించడం బాధకలిగించిందని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని.. తగు చర్యలు తీసుకోవాలని కొరతానని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. పార్టీ కార్యకర్తల మనో భావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.

Read more RELATED
Recommended to you

Latest news