ఫైబర్ నెట్ వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణాధికారులు దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను న్యాయస్థానం కొట్టివేసిందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఛార్జిషీట్‌ను కోర్టు తిరస్కరిస్తే జగన్ సొంతపత్రికలో మాత్రం తప్పుడు కథనం ప్రచురించారన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ వార్త రాశారని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం
చేశారు. చంద్రబాబు పై తప్పుడు కేసులు పెట్టిన మధుసూదన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి పై కేసు పెట్టే
అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సీఐడీ పై వచ్చిన ఆరోపణలపై ఆ విభాగం అధికారులు స్పందించి
స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు.