Koneru Prasad : వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, 2014లో విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. శుక్రవారం హైదరాబాద్ లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రాజేంద్రప్రసాద్ కు భార్య విమలాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేంద్రప్రసాద్ పుట్టి పెరిగింది విజయవాడలోని గుణదలలో…. ఆయన తండ్రి కోనేరు మధుసూదనరావు విజయవాడలో గతంలో ప్రముఖ వైద్య నిపుణులు.
కాలేజీలో చదివే సమయంలోనే…. విద్యాభ్యాసాన్ని మధ్యలో వదిలేసిన రాజేంద్రప్రసాద్ ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఆయన చెన్నైలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. హైదరాబాదు నుంచి ఆయన భౌతికకాయాన్ని చెన్నై తరలించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బీసెంట్ నగర్ స్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక కోనేరు రాజేంద్రప్రసాద్ మరణం పట్ల పలుగురు సంతాపం తెలుపుతున్నారు.